»Some More Weeks Delays In Garena Free Fire India Release
Free Fire India: గారెనా ఫ్రీ ఫైర్ ఇండియాలో మరింత ఆలస్యం!
ఇండియాలో సెప్టెంబర్ 5న మళ్లీ ప్రారంభం కానున్న గారెనా(Garena) ఫ్రీ ఫైర్ గేమ్(free fire game) లాంచ్ మరికొన్ని వారాలు ఆలస్యం అవుతుందని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అయితే వారు గేమ్‌ప్లేను మరింత మెరుగుపరుస్తున్న కారణంగా వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ ఫైర్ గేమ్(Free Fire game) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ గేమ్ ను ఇండియా(india)లో బ్యాన్ చేస్తారని గతంలో పుకార్లు వచ్చాయి. కానీ తర్వాత అవి నిజం కాదని తేలింది. అయితే ఇటివల సెప్టెంబర్ 5న ఫ్రీ ఫైర్ ఆటను ఇండియాలో పునఃప్రారంభించబడుతుందని ప్రకటించారు. కానీ ఈ గేమ్ ను రిలీజ్ చేయలేదు. మరికొన్ని రోజుల్లో ఇది ఆటగాళ్లకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడానికి మరికొన్ని ఫీచర్లతో మరికొన్ని వారాల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఫ్రీ ఫైర్ అభిమానులు మరిన్ని అప్డేట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గారెనా(Garena) ఫ్రీ ఫైర్ ఆటకు ఇండియా నుంచి అపూర్వమైన స్పందన రావడంతో తాము సంతోషిస్తున్నామని నిర్వహకులు తెలిపారు. తాను మా ఫ్రీ ఫైర్ గేమ్ ను ఇండియా అభిమానులందరికీ సాధ్యమైనంత మంచి అనుభవాన్ని అందించడానికి మరికొన్ని వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. గేమ్‌ప్లేను మెరుగుపరచడంతో పాటు, ఫ్రీ ఫైర్ ఇండియా అనుభవానికి సంబంధించిన పలు ఫీచర్లను పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మా ఫ్రీ ఫైర్ ఇండియా కమ్యూనిటీకి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తుందని స్పష్టం చేశారు.
సింగపూర్‌కు చెందిన గ్లోబల్ ఆన్లైన్ గేమ్ డెవలపర్, పబ్లిషర్ అయిన గారెనా ఇటీవలే ఫ్రీ ఫైర్(free fire) ఇండియాను ప్రారంభించినట్లు ప్రకటించింది. ధోనీ, ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ, బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ సహా పలువురు క్రీడా తారలను పాత్రలుగా ఈ గేమ్ లో చేర్చడంతో గరీనా కొత్త ప్రారంభ తేదీని మరింత ఆసక్తి పెరిగింది.
డాటర్స్ డే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాల్గవ ఆదివారం జరుపుకుంటాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా డాటర్స్ డేను నిర్వహిస్తున్నారు. అయితే భారత్‌లో దేవతలను పూజించినా..పలు చోట్ల ఇప్పటికే ఆడపిల్లలను కడుపులోనే చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఆడపిల్లల ప్రాముఖ్యత గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కూతుళ్లు కొడుకుల కంటే ఏ విషయంలో కూడా తక్కువ కాదు.