• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

ఆసియా కప్ విజేతగా భారత్

ACC ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 134 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 88 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో తేజల్ (51) అర్ధసెంచరీతో రాణించగా, బౌలింగ్‌లో ప్రేమ రావత్ 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

February 22, 2026 / 04:06 PM IST

అభిషేక్ శర్మపై అమీర్ హాట్ కామెంట్స్

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై పాకిస్తాన్ పేసర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ గుడ్డిగా బ్యాటింగ్ చేస్తాడని విమర్శించాడు. బంతి స్లాట్‌లో పడితే తప్ప అతడు షాట్లు ఆడలేడని, ఆఫ్ సైడ్ వచ్చే బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటం అతడి బలహీనత అని పేర్కొన్నాడు. అభిషేక్ తన ఆటతీరును మెరుగుపరుచుకోకపోతే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ కాలం కొనసాగలేడని హెచ్చరించాడు.

February 22, 2026 / 03:57 PM IST

టీమిండియా తుది జట్టు ఇదే..!

సౌతాఫ్రికాతో జరగబోయే మ్యాచ్‌ కోసం టీమిండియా తుది జట్టులో పెద్దగా మార్పులు చేయకూడదని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని భిప్రాయపడ్డాడు. ఈ మేరకు పఠాన్ అంచనా వేసిన టీమిండియా తుది జట్టు ఇలా ఉంది: ఇషాన్, అభిషేక్, తిలక్, సూర్య, పాండ్యా, దూబే, రింకూ, అక్షర్, అర్ష్‌దీప్, చక్రవర్తి, బుమ్రా.

February 22, 2026 / 03:27 PM IST

‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో సూర్య

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జనవరి నెలకు గాను ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేసులో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు గాను అతడిని ఈ అవార్డుకు నామినేట్ చేశారు. సూర్యతో పాటు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్, న్యూజిలాండ్ బ్యాటర్ డారల్ మిచెల్ కూడా ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు.

February 22, 2026 / 03:14 PM IST

మాజీ భార్య కోసం కోట్లు ఖర్చు చేసిన పాండ్యా..!

టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా, కుమారుడు అగస్త్యకు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కానుకగా ఇచ్చాడు. గతేడాది ఈ జంట విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ, కుమారుడి బాధ్యతలను ఇద్దరూ కలిసి పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి సౌకర్యం కోసం హార్దిక్ ఈ విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం SMలో వైరల్ అవుతున్నాయి.

February 22, 2026 / 02:50 PM IST

SL vs ENG: ప్లేయింగ్-11 ఇదే

SL: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుసల్ మెండిస్(w), పవన్ రత్నాకే, కమిందు మెండిస్, దసున్ షనక(c), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంకENG: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(c), సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్

February 22, 2026 / 02:40 PM IST

T20 WC: ఇంగ్లండ్‌పై టాస్ గెలిచిన శ్రీలంక

టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా శ్రీలంక, సౌతాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఏడాది పల్లెకెలె స్టేడియంలో జరిగిన 6 మ్యాచ్‌ల్లో 5 సార్లు ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. అందుకే శ్రీలంక కెప్టెన్ కూడా ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు. ఈ పిచ్‌పై సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 177 పరుగులుగా ఉంది.

February 22, 2026 / 02:37 PM IST

అతడితో జాగ్రత్త: డికాక్

ఇవాళ్టి మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి విషయంలో బ్యాటర్లు అప్రమత్తంగా ఉండాలని క్వింటన్ డికాక్ పేర్కొన్నాడు. గతంలో భారత్‌తో సిరీస్‌లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడని గుర్తుచేశాడు. అందుకే వరుణ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు. రెండు జట్లలోనూ బలమైన ఆటగాళ్లు ఉన్నందున, ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు.

February 22, 2026 / 02:19 PM IST

పాక్ అందుకే ఓడిపోతోంది: షోయబ్ అక్తర్

భారత్‌తో పాక్ మ్యాచ్ ఓడిపోవడానికి టీమ్ సెలక్షనే కారణమని ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. జట్టు ఎంపిక సరిగ్గా లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. టీమ్ సెలక్షన్ సరిగ్గా ఉంటే ఏ జట్టునైనా ఓడించగల సమర్థత పాకిస్తాన్‌కు ఉందన్నారు. ICC టోర్నీల్లో పాక్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోతున్న విషయం తెలిసిందే. కాగా, పాక్ సెమీస్ చేరాలంటే ENG, SLపై కచ్చితంగా గెలవాలి.

February 22, 2026 / 01:59 PM IST

పాక్ సూపర్‌ లీగ్‌లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్‌

పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL) 2026లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్‌ చేరాడు. ఈ లీగ్‌లో ఇప్పటికే చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు పాల్గొంటుండగా.. తాజాగా యువ వికెట్‌కీపర్‌ రూబిన్‌ హెర్మన్‌ వీరి సరసన చేరాడు. హెర్మన్‌ను లాహోర్‌ ఖలందర్స్‌ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఖలందర్స్‌తో జతకట్టిన అనంతరం హెర్మన్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కింది.

February 22, 2026 / 12:42 PM IST

టీమిండియా కెప్టెన్ సూర్యకు మరో గుడ్‌‌న్యూస్‌

సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు మరో గుడ్ న్యూస్ అందింది. 2026 జనవరి నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. పురుషుల విభాగంలో స్కైతో పాటు న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌, ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జో రూట్‌ కూడా నామినేట్‌ అయ్యారు.

February 22, 2026 / 11:27 AM IST

ఓపెనర్‌గా బాబర్ పనికిరాడు: మైక్ హెసన్

పాకిస్తాన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ మైక్ హెసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌లలో ఓపెనర్‌గా పవర్ ప్లే సమయంలో బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ 100 కంటే తక్కువగా ఉందని, ఇది ఆధునిక T20 ఫార్మాట్‌కు సరిపోదని పేర్కొన్నాడు. ‘జట్టుకు ఏం అవసరమో బాబర్‌కు తెలుసు. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయలేనప్పుడు, మిడిల్ ఓవర్లలో జట్టును ఆదుకోవడం మంచిదని భావించాం’ అని తెలిపాడు.

February 22, 2026 / 10:52 AM IST

T20 WC: సెమీస్‌లో భారత్-పాక్ తలపడితే?

T20 ప్రపంచకప్-2026లో భాగంగా సెమీస్‌లో భారత్-పాక్ తలపడితే ఆ మ్యాచ్ MAR 4న జరుగుతుంది. దేశమంతా హోలీ వేడుకల్లో ఉండగా.. శ్రీలంక గడ్డపై దాయాదుల పోరు ఉత్కంఠను పంచనుంది. ఒకవేళ పాక్ కాకుండా మరే ఇతర జట్టుతోనైనా భారత్ సెమీఫైనల్ అడితే ఆ మ్యాచ్ ముందుగా నిర్ణయించినట్లే MAR 5న ముంబైలోనే జరగనుంది. ఈ నిబంధనల ప్రకారం పాక్ ఆడే తొలి సెమీస్ కూడా కోల్‌కతా నుంచి కొలంబోకు మారుతుంది.

February 22, 2026 / 10:33 AM IST

భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌ రద్దయితే?

T20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో ఇవాళ భారత్, దక్షిణాఫ్రికా జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని, వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలపింది. రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే అప్పుడు భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల‌కు చెరొక పాయింట్‌ను కేటాయిస్తారు.

February 22, 2026 / 10:20 AM IST

నాకౌట్లలో భారత్-దక్షిణాఫ్రికా రికార్డు

నాకౌట్ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా ఎప్పుడూ భారత్‌ను ఓడించలేదు. ఈ రెండు జట్లు నాకౌట్ మ్యాచ్‌లలో రెండుసార్లు తలపడ్డాయి. భారత్ రెండింటిలోనూ గెలిచింది. 2014 టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో తలపడ్డాయి. భారత్ విజయం సాధించింది. 2024 ఫైనల్‌‌లో భారత్ గెలుపొందింది. IND, SA ఫామ్‌ను పరిశీలిస్తే.. రెండు జట్లు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి.

February 22, 2026 / 09:30 AM IST