»Virat Kohli And Rohit Sharma Showcase Epic Pool Dance After Beating Pakistan In Asia Cup 2023 Watch Vide
IND vs PAK: పాక్ ను ఓడించి .. స్విమ్మింగ్ పూల్‌లో ఫుల్ ఎంజాయ్ చేసిన భారత క్రికెటర్లు
ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైన విరాట్ కోహ్లీ కేక్ కట్ చేశాడు. దీని తర్వాత, శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లందరూ రికవరీ సెషన్ కోసం స్విమ్మింగ్ పూల్‌లో గడిపారు.
IND vs PAK: ఆసియా కప్‌లో భారత జట్టు సూపర్-4 దశను 228 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి శుభారంభం చేసింది. వర్షం అంతరాయం కారణంగా 2 రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో పాక్‌ను ఓడించింది. ఈ అద్భుతమైన విజయం తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియా ఆటగాళ్లు రిఫ్రెష్ కోసం హోటల్లోని పూల్‌లో గడిపారు. ఈ సందర్భంగా పూల్ డ్యాన్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య జుగల్బందీ కనిపించింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చారిత్రాత్మక విజయం సాధించి హోటల్‌కు తిరిగి వచ్చిన భారత జట్టుకు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైన విరాట్ కోహ్లీ కేక్ కట్ చేశాడు. దీని తర్వాత, శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లందరూ రికవరీ సెషన్ కోసం స్విమ్మింగ్ పూల్‌లో గడిపారు.
ఈ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ పూల్‌లో భాంగ్రా స్టెప్పులు వేస్తూ కనిపించాడు. విరాట్ కోహ్లీ కూడా పూల్‌లో సరదాగా గడిపాడు. ఈ సమయంలో రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ సహా టీమ్ ఇండియా ఇతర ఆటగాళ్లు పూల్‌లో కనిపించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో విడుదల చేసింది.
A memorable victory followed by a much-deserved recovery session ahead of today’s Super 4s encounter 😃👌
ఆసియా కప్ 2023లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన ఈ విజయం ఇప్పుడు వన్డే ఫార్మాట్లో పరుగుల పరంగా అతిపెద్ద విజయం. అంతకుముందు 2008లో మిర్పూర్ మైదానంలో టీమిండియా 140 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 356 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాక్ ఇన్నింగ్స్‌ను కేవలం 128 పరుగులకే పరిమితం చేసింది.