»Pakistan Skipper Babar Azam Wins Icc Men S Player Of The Month Award For August 2023
Babar Azam: ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డును గెలుచుకున్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజం.. ఇది అతనికి మూడోది
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌కు ఇంతకుముందు ఏప్రిల్ 2021, మార్చి 2022లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ టైటిల్ లభించింది. ఈ అవార్డును గెలుచుకున్న తర్వాత సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
Babar Azam: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆగస్టు నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ మేల్ క్రికెటర్ అవార్డును పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌కు అందజేసింది. ప్రస్తుతం అతను ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-1 బ్యాట్స్‌మెన్. ప్లేయర్ ఆఫ్ ది మంత్కి నామినేట్ చేయబడిన ఆటగాళ్లలో బాబర్‌తో పాటు షాదాబ్ ఖాన్, నికోలస్ పురాన్ కూడా ఉన్నారు. బాబర్ ఆజం ఆగస్ట్ 2023లో బ్యాట్‌తో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇందులో అతను 4 ఇన్నింగ్స్‌లలో 64 సగటుతో 264 పరుగులు చేశాడు. ఈ సమయంలో బాబర్ 2 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. బాబర్ కెప్టెన్సీలో ఆగస్టు నెలలోనే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన 3-మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ 3-0 తేడాతో గెలుచుకుంది.
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌కు ఇంతకుముందు ఏప్రిల్ 2021, మార్చి 2022లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ టైటిల్ లభించింది. ఈ అవార్డును గెలుచుకున్న తర్వాత సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత నెల నా జట్టుకు.. నాకు చాలా అద్భుతంగా ఉంది. ఆసియా కప్‌లో పాక్ ప్రేక్షకుల ముందు ఆడడం చాలా బాగుంది. నేను కూడా అందులో 150 పరుగులు చేయగలిగాను. ఆసియా కప్ జరుగుతున్నందున, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ ప్రారంభం కావడానికి ఎక్కువ సమయం లేనందున నేను ఈ ఫామ్‌ను కొనసాగించడానికి ప్రయత్నిస్తాను.’ అంటూ ఐసిసికి చేసిన ప్రకటనలో పేర్కొన్నాడు.
2023 ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు అద్భుత ఆరంభాన్ని ఇచ్చింది. కానీ సూపర్ 4లో భారత్‌పై 228 పరుగుల భారీ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు 357 పరుగుల భారీ లక్ష్యం ఉండగా, ఆ జట్టు 128 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో బాబర్ 24 బంతులు ఎదుర్కొని 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇప్పుడు ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు తన తదుపరి మ్యాచ్‌ని సెప్టెంబర్ 14న శ్రీలంకతో ఆడనుంది.