»Bharat Should Also Be Written On Cricket Jerseys Virender Sehwags Tweet To Bcci
Bharath: జెర్సీలపై భారత్ అని రాయాలి.. వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్
ఇండియా పేరును కేంద్రం మారుస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రముఖుల ట్వీట్లు వైరల్‌గా మారుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ బీసీసీఐకి ఒక ట్వీట్ చేశారు. అది నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.
Bharat should also be written on cricket jerseys. Virender Sehwag's tweet to BCCI
Bharath: ఇండియా(India) పేరు మార్చేదిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేగవంతం చేస్తొందా అంటే నిజమే అనే సంకేతాలు కనబడుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 మధ్య జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా పేరును భారత్ మార్చే ఆలోచనలతో రాజ్యాంగ సవరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పందించారు. 2023 వరల్డ్ కప్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19వ తేదీ వరకు జరగనుందని, ఈ సమరంలో భారత ఆటగాళ్లు భారత్ అని రాసి ఉన్న జెర్సీల(jerseys)ను ధరించి, ఆడాలని సెహ్వాగ్ సూచిస్తూ ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు.
మనం ఈ సమయంలో నెదార్లండ్స్, మయన్మార్‌ను స్ఫూర్తిగా తీసుకొని, ఈ వరల్డ్ కప్(World cup)లో తమ జెర్సీలపై పేరు మార్చుకోవాలని సెహ్వాగ్ పేర్కొంటూ బీసీసీఐ సెక్రటరీ జయ్ షాకు ట్యాగ్ చేశారు. 1996 వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్ హాలండ్ అని రాసి ఉన్న జెర్సీ ధరించి ఆడింది. తరువాత 2003లో నెదర్లాండ్స్ అని రాసి ఉన్న జెర్సీని ధరించి ఆడారని సెహ్వాగ్ గుర్తు చేశారు. అలాగే మయన్మార్ కూడా బర్మాను పేరు మార్చుకుంది. బ్రిటీష్ వాళ్లు పెట్టిన పేరు బర్మాను మళ్లీ మయన్మార్‌గా మార్చుకున్నారని తెలిపారు. ఆ విధంగా మనం కూడా భారత్ అని మార్చుకోవడంలో తప్పు లేదని సెహ్వాగ్ వెల్లడించారు. మనం భారతీయులం అని ఇండియా అనే పేరును బ్రిటిష్ వాళ్లు నామకరణం చేశారని తెలిపారు. ఒక పేరు మనలో గొప్పతనాన్ని నింపేదిగా ఉండాలని తాను ఎప్పుడు నమ్ముతానని, మన దేశం అసలు పేరు భారత్ అని ఆ పేరును ఎప్పుడో తిరిగి పొందాల్సిందని కాని కాలం గడిచిపోయిందని అన్నారు. ఈ ప్రపంచ కప్‌లో మన ఆటగాళ్లు భారత్ పేరున్న జెర్సీ ధరించి ఆడితే చూడాలనుకుంటున్నానని సెహ్వాగ్ పేర్కొన్నారు.
I have always believed a name should be one which instills pride in us. We are Bhartiyas ,India is a name given by the British & it has been long overdue to get our original name ‘Bharat’ back officially. I urge the @BCCI@JayShah to ensure that this World Cup our players have… https://t.co/R4Tbi9AQgA