»Neeraj Chopra Second Place In Diamond League 2023 Javelin Throw
Diamond League 2023: జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు షాక్!
జ్యూరిచ్ డైమండ్ లీగ్ 2023 పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా(Neeraj Chopra) కాస్తా తడబడినట్లు అనిపిస్తుంది. గతంలో మొదటి స్థానంలో నిలిచిన ఈ భారత అథ్లెట్..ఈసారి 85.71 మీటర్లతో రెండో స్థానం కైవసం చేసుకున్నాడు.
Neeraj Chopra second place in Diamond League 2023 javelin throw
ప్రపంచ ఛాంపియన్‌గా గెల్చిన నాలుగు రోజుల తర్వాత నీరజ్ చోప్రా(Neeraj Chopra) జ్యూరిచ్ డైమండ్ లీగ్ 2023(Diamond League) పురుషుల జావెలిన్ త్రో పోటీల్లో వెనుకబడ్డాడు. చివరి రౌండ్లో 85.71 మీటర్లు త్రో చేసి రెండో స్థానంలో నిలిచాడు. అయితే చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వడ్లెజ్ (85.86 మీటర్ల)తో మొదటి స్థానంలో ఉన్నారు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 85.04 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు.
చోప్రా డిఫెండింగ్ డైమండ్ లీగ్‌లో నిరాడంబరమైన 80.79 మీటర్లతో ప్రారంభించాడు. అయితే నాల్గవ రౌండ్లో, చోప్రా 85.22తో ఐదవ రౌండ్ చివరిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచాడు. మొదటి ముగ్గురికి ఆరవ, చివరి ప్రయత్నం లభించింది. వారిలో వడ్లెజ్చ్, చోప్రా, జర్మనీకి చెందిన వెబర్ ఉన్నారు. అయితే ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత ఈ ముగ్గురూ జ్యూరిచ్ డైమండ్ లీగ్‌లో పాల్గొన్నారు. కాబట్టి వారి శరీరాలు కొంచెం అలసిపోయి ఉంటాయి. కాబట్టి నిజంగా పెద్ద త్రో(javelin throw) చాలా కష్టమని పలువురు చెబుతున్నారు. ఆదివారం రాత్రి బుడాపెస్ట్‌లో బంగారు పతకం సాధించిన తర్వాత తన వెన్ను, భుజాలు నొప్పిగా ఉన్నాయని చోప్రా అన్నారు.
Diamond League – Zurich 💎
Do watch India's finest Atheltes in action live
✨M Sreekshankar – 23:54 PM IST ✨Neeraj Chopra – 00:12 AM IST
మరోవైపు ఈ జ్యూరిచ్‌లో మరో భారతీయుడు, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్(murali sreeshankar) 7.99 మీటర్ల బెస్ట్ జంప్‌తో ఐదో స్థానంలో నిలిచాడు. శ్రీశంకర్ 14 పాయింట్లతో నాలుగు ఈవెంట్ల తర్వాత మూడవ స్థానంలో ఉన్నాడు. స్విట్జర్లాండ్‌కు చెందిన సైమన్ ఎహమ్మర్ (23 పాయింట్లు), ప్రపంచ ఛాంపియన్ మాల్టియాడిస్ టెంటోగ్లో (29 పాయింట్లు) కంటే వెనుకబడ్డాడు. జమైకాకు చెందిన తాజయ్ గేల్ (8.07మీ) రెండో స్థానంలో నిలవగా, జమైకాకు చెందిన తజయ్ గేల్ జ్యూరిచ్‌లో 8.20 మీటర్లతో గెలుపొందాడు.