భారత అథ్లెట్ నీరజ్ చోప్రా మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత, అథ్లెటిక్ స్టార్ నీరజ్ చోప్రా ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అథ్లెట్‌గా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచే నీరజ్ ప్రయాణం అంత సులభం కాదు. నీరజ్ తన ఫిట్‌నెస్‌ని ఎప్పటికప్పుడు ఎలా కాపాడుకుంటాడో ఓసారి చూద్దాం.
హర్యానాలోని పానిపట్‌లో నివసించే నీరజ్ చోప్రా చిన్నతనంలో అధిక బరువుతో ఉన్నాడు. కానీ ప్రస్తుతం ప్రపంచంలోని ఫిటెస్ట్ అథ్లెట్లలో ఒకడు. ఫిట్‌గా ఉండేందుకు ఏం చేశాడో చూద్దాం. స్టైలిష్ లుక్స్ , ఫిట్నెస్ కారణంగా, నీరజ్ చోప్రా ప్రజలలో ముఖ్యంగా అమ్మాయిలలో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. తన ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడట.
నీరజ్ సాధారణంగా సలాడ్ లేదా పండ్లు వంటి వాటిని తినడానికి ఇష్టపడతాడు. వీటన్నింటితో పాటు కాల్చిన చికెన్ బ్రెస్ట్ , గుడ్లు వంటి ఆహారాన్ని కూడా తింటారు. అంతే కాకుండా నీరజ్ చోప్రాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఒక ఇంటర్వ్యూలో అతను తన చీట్ మీల్లో ఎక్కువ స్వీట్లు తినడానికి ఇష్టపడతానని చెప్పాడు. ఆయన సాధారణంగా స్వీట్లను చాలా పరిమితంగా తింటారు. నీరజ్ చోప్రాకు ఇంట్లో నెయ్యితో చేసిన చుర్మా అంటే చాలా ఇష్టం.
ఇది కాకుండా సాల్మన్ ఫిష్ కూడా నీరజ్ డైట్లో భాగం. ఆయనకు మాంసాహారం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కొన్ని కాల్చిన సాల్మన్లను ఇష్టపడతారు. అలాగే వారు తనను తాను రిఫ్రెష్ చేసుకోవడానికి తాజా పండ్ల రసాలను ఎక్కువగా తాగుతారు. సాధారణంగా వ్యాయామం తర్వాత రెండు గ్లాసుల తాజా రసం తాగుతారు. అంతే కాదు నీరజ్ చోప్రాకు స్ట్రీట్ ఫుడ్‌లో పానీ పూరీ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు పానీపూరీని ఇష్టంగా లాగించేస్తాడట.