Cricket: భారత్ రెండో టీమ్(Team India) ఐర్లాండ్(Ireland) జట్టుతో టీ20 సిరీస్(T20 Series) గెలిచింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయి డీఎల్ఎస్(DLA) ప్రకారం విన్నర్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. మ్యాచ్ గెలిచినా అందరిలో అసంతృప్తి ఉంది. రెండో మ్యాచ్‌ను.. టీమిండియా బీ క్యాడర్ టీమ్ విజయం సాధించింది. 33 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను బుమ్రా నేతృత్వంలోని జట్టు మట్టి కరిపించింది.
తొలుత టాస్ గెలిచిన అతిథ్య జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. ఐర్లాండ్ బౌలర్లకు బుమ్రా సేన చుక్కలు చూపించి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లు ఆడి 8 వికెట్లకు 152 పరుగులకే చతికిలపడి చాప చుట్టేసింది. భారత్ బౌలర్లు సమిష్టిగా సత్తా చాటడంతో విజయం సులభం అయింది. కెప్టెన్ బుమ్రా (Jasprit Bumrah) 2, ప్రసిద్ధ్ కృష్ణ 2, రవి బిష్ణోయ్ 2, అర్షదీప్ సింగ్ 1 వికెట్ తీశారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఆండ్రూ బాల్ బిర్నీ చేసిన 72 పరుగులకే అత్యధికం. ధాటిగా ఆడిన బాల్ బిర్నీ 51 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 4 సిక్సులు కొట్టాడు. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టకర్ డకౌట్ కాగా, కీలక ఆటగాడు హ్యారీ టెక్టర్ (7) నిరాశపరిచాడు. కర్టిస్ కాంఫర్ 18, జార్జ్ డాక్రెల్ 13, మార్క్ అడౌర్ 23 పరుగులు చేయడంతో ఐర్లాండ్ స్కోరు 150 మార్కు చేరుకుంది. టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఐర్లాండ్ సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. టీమిండియా ఈ విజయంతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఇక మిగిలిన మూడో మ్యాచ్ ఆగస్టు 23న జరగనుంది.