Festival: శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమి రోజు లేదా శ్రావణ మాసం (Sravana masam) ప్రారంభం అయిన ఐదవ రోజు నాగ పంచమిని జరుపుకుంటారు. నాగుల చవితి (Nagula Chavithi) సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు. నాగుపామును నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పండుగలో ముఖ్యంగా స్త్రీలు నాగదేవతను పూజిస్తారు. పుట్టలో పాలు పోసి తమ సోదరులు, కుటుంబ సభ్యుల భద్రత కోసం ప్రార్థిస్తారు.
ఈ ఏడాది నాగ పంచమి(Naga Panchami) ఆగస్టు 21 సోమవారం రోజున వచ్చింది. దృక్ పంచాంగ్ ప్రకారం నాగ పంచమి పూజ సమయం ఉదయం 5:53 గంటలకు ప్రారంభమై 8:30 గంటలకు ముగుస్తుంది. నాగ పంచమి పూజా తిథి ఆగస్టు 21న ఉదయం 12:21 గంటలకు ప్రారంభమై ఆగస్టు 22న తెల్లవారుజామున 2:00 గంటలకు ముగుస్తుంది.
మానవుని మనుగడలో పాముకు ఎంతో ప్రాధాన్యత ఉంద. అతను వేసే పంటను, ఎలుకలు, ఇతర కీటకాలు నాశనం చేయకుండా చూసుకుంటాయి. అందుకే పామును దైవంగా భావిస్తాడు. నాగదేవతను అత్యంత శక్తివంతమైన దేవతగా భావిస్తారు. పాములకు ఏ పూజ చేసినా నాగదేవతలకు చేరుతుందని నమ్మకం. భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పాములను పూజిస్తారు. ఈ రోజున భక్తులు పాలతో పాటు చలిమిడి (నువ్వులతో చేసింది) అనే ప్రసాదం కూడా సమర్పిస్తారు. దృక్ పంచాంగ్ ప్రకారం నాగ పంచమి పండుగ సమయంలో 12 పాములను పూజిస్తారు. అనంత్, శేష, వాసుకి, పద్మ, కంబాల్, కర్కోటక్, అశ్వతర్, దృతరాష్ట్ర, శంఖపాల్, కాళియ, తక్షక్, పింగల్ తదితర 12 రకాల పాములను పూజిస్తారు. ఈ రోజున పాములను పూజించే భక్తులకు సర్ప భయం, కాల సర్ప దోషం తొలగిపోతాయని నమ్ముతారు. నాగదోషం ఉంటే జీవితంలో పెళ్లి యోగ్యత, సంతాన సాఫల్యం ఉండదు దానికి శాంతి పూజలు నిర్వహిస్తారు. తద్వారా మంచి ఫలితాలను పొందుతూ ఈ విశ్వాసాన్ని అనాదిగా పాటిస్తున్నారు.