మేషరాశి
మేషరాశి పురుషులకు స్త్రీల మూలకంగా లాభం చేకురుతుంది. శుభపరమైన ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులను గౌరవిస్తారు. కుటుంబం నుంచి ఆదరాభిమానాలను సంపూర్ణంగా పొందుతారు. మంచిపనుల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. స్నేహితులు మీకు మరింత దగ్గర అవుతారు.
వృషభరాశి
ఈ రాశివారు ఈరోజు ఎక్కువగా విందులు, వినోదాల్లో పాల్గొంటారు. తగినంత గౌరవ మర్యాదలను పొందుతారు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా, మానసికంగా బలహీనులు అవుతారు.
మిథునరాశి
మిథునరాశివారు కుటుంబ పరిస్థితులను అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగుతుంది. అనుకోని ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో కాస్త సహనం వహించాలి. శుభకార్యలను నిర్వహించడం మంచింది.
కర్కాటకరాశి
ఈ రాశివారు కొత్తవ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారితో జాగ్రత్తగా ఉండడం మంచింది. అనుకున్న పనులు సవ్యంగా జరగవు. శాంతంగా ఆలోచించాలి. సోదరులతో గొడవ పడతారు. దైవదర్శననానికి ప్రాధాన్యత ఇస్తారు. రుణప్రయాత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కొన్ని విషయాల పట్ల జాగ్రత్త వహించడం మంచింది లేదంటే అప్రతిష్టపాలు అవుతారు. స్నేహితులతో గొడవలు పడే అవకాశం ఉంటుంది.
సింహరాశి
సింహరాశి వారిలో ఎక్కవ కుటుంబ కలహాలు ఉంటాయి. స్త్రీలలో ఆనారరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మానసికంగా ఆందోళన చెందుతారు. బంధువులతో గొడవపడుతారు. రుణప్రయత్నం ఫలిస్తుంది. మానసికంగా ఆందోళన చెందుతారు. మిత్రులతో కలహించుకోరాదు. ఏం చేసిన ఆచీతూచీ చేయాలి.
కన్యరాశి
ఈ రాశివారు కొత్త వస్తువు, ఆభరణాలను పొందుతారు. పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది.
తులరాశి
తులరాశివారు వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.
వృశ్చికరాశి
రాశి వారు వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిరనివాసం ఉంటుంది.
ధనుస్సురాశి
ధనుస్సురాశి వారు వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
మకరరాశి
ఈ రాశివారు ఈ రోజు శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు.
కుంభరాశి
కుంభరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. మానసిక ఆందోళనకు గురవుతారు దీన్ని తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరిక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
మీనరాశి
మీనరాశి వారు సహనంగా ఉండాలి. కుటుంబంలో చిన్నిచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.