T20 series: ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా జింబాబ్వే బయలుదేరింది. యువ ఆటగాడు శుభ్ మాన్ గిల్ సారథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా ఈ ఆట కొనసాగనుంది. జూలై 6 నుంచి, జులై 14 వరకు ఈ టీ20 సిరీస్‌ల మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే దీనిలో భాగంగా మ్యాచ్ పలు మార్పులు చోటుచేసుకున్నారు. బీసీసీ మొదటి టీమ్ ప్రకటించింది. అయితే తొలి రెండు టీ20ల్లో భారత ఆటగాళ్లలో మరో ముగ్గురికి బీసీసీఐ చోటు కల్పిస్తున్నట్టు నేడు ప్రకటించింది. టీమ్‌లో సంజు శాంసన్, శివమ్ దుబే, యశస్వీ జైస్వాల్ ఇంకా భారతదేశానికి రాలేదు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బార్బిడాలోనే ఉన్నారు. అక్కడి వాతవరణ పరిస్థితులను బట్టి బీసీసీ ప్రత్యేక విమానాన్ని పంపించనుంది. దీంతో బుధవారం ఉదయం వారు ఇండియాకు వస్తారు.
ఇప్పుడు వీరి ముగ్గురి స్థానంలో సాయి సుదర్శన్ (బ్యాటర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్ బ్యాట్స్ మన్), హర్షిత్ రాణా (బౌలర్) జింబాబ్వే పర్యటనలో ఎంపిక చేశారు.
తొలిరెండు రోజులు ఆడే జట్టు.. శుభ్ మాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేశ్ కుమార్, తుషార్ దేశ్ పాండే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హర్షిత్ రాణా.
మూడవరోజు నుంచి ఆడే జట్టు..
బీసీసీ ప్రకటించిన భారత జట్టు.. శుభ్ మాన్ గిల్ (కెప్టెన్), జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సంజు శాంసన్, రియాన్ పరాగ్, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేశ్ కుమార్, తుషార్ దేశ్ పాండే.
జింబాంబ్వేలోని హరారే వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతాయి.