రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు ఈ 2023 IPL సీజన్లో కూడా అభిమానులను నిరాశ పరిచింది. ప్లే ఆఫ్ అవకాశాలను దక్కించుకోవాల్సిన చివరి మ్యాచులో ఆదివారం రాత్రి గుజరాత్(GT) చేతిలో ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది.
గత నెలలో అంటాల్యలో జరిగిన ప్రపంచ కప్ స్టేజ్ 1 స్వర్ణం గెలిచిన తర్వాత, జ్యోతి, ఓజాస్ జోడి కొత్తగా మరో బంగారు పతకం గెల్చుకున్నారు. టాప్-సీడ్ కొరియా జట్టును 156-155తో ఓడించి ఔరా అనిపించుకున్నారు. దీంతోపాటు యువ ఆర్చర్ ప్రథమేశ్ జవాల్కర్ మేటి ఆర్చర్‌కు షాకిస్తూ పసిడి గెల్చుకున్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్(LSG) తమ చివరి లీగ్ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్టును ఒక్క పరుగు తేడాతో ఓడించింది. శనివారం జరిగిన మ్యాచులో ఇది జరుగగా లక్నో ఐపీఎల్(IPL 2023)ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించగా..కోల్‌కతా ప్లే ఆఫ్ ఆశలను కోల్పోయింది.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli ) అభిమాని ఏకంగా దేశాలు దాటి హైదరాబాద్(California to Hyderabad) వచ్చేశాడు. ఈ సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియాలోని ఓర్లాండోకు చెందిన ఓ అభిమాని హైదరాబాద్లోని ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ కోసం గురువారం వచ్చాడు. ఆ క్రమంలో తన ఆరాధ్యదైవమైన విరాట్ కోహ్లీని చూసేందుకు 8,985 మైళ్ల ప్రయాణాన్ని పూర్తి చేశాడు.
ఇదంతా వర్షిణితో ప్రేమ కారణమని నెటిజన్లు ఆరోపిస్తున్నాయి. వర్షిణితో సుందర్ ప్రేమలో ఉండడం కారణంగానే అతడు జట్టులో స్థానం కోల్పోయాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ తప్పిదాన్ని వెంటనే గ్రహించిన స్టార్ స్పోర్ట్స్ నిర్వాహకులు వెంటనే తొలగించారు. అయితే అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ‘రాజస్థాన్ కొత్త కెప్టెన్ యుజ్వేంద్ర చాహల్’ అంటూ ట్రోల్ చేశారు.
రాంచీలో జరుగుతున్న ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చివరి రోజున ఏపీకి చెందిన జ్యోతి యర్రాజీ(Jyothi Yarraji) రెండో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో జ్యోతి తన అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
విరాట్ కోహ్లీ(virat kohli) సెంచరీ, డు ప్లెసిస్ భాగస్వామ్యంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు..సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) టీంను నిన్న ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో RCB జట్టు IPL 2023లో ప్లేఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది.
లాల్ సలామ్ మూవీ(Laalsalam Movie)లో మొయిదీన్ భాయ్ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ ను రజినీ(Rajanikanth) చేస్తున్నారు. ఇటీవలె ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.