Team India- Australia One Day, T20 schedule Release
Team India: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, టీ-20 షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. 3 వన్డేలు, 5 టీ-20 మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబర్ 22వ తేదీన ఫస్ట్ వన్డే, 24వ తేదీన రెండో వన్డే, 27వ తేదీన మూడో వన్డే జరగనుంది. నవంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు ఐ 20 మ్యాచ్లు ఆడతారు. నవంబర్ 23వ తేదీన ఫస్ట్ టీ-20 మ్యాచ్ వైజాగ్ వేదికగా జరుగుతుంది. లాస్ట్ టీ-20 మ్యాచ్ డిసెంబర్ 3వ తేదీన హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తారు. అలాగే భారతదేశంలో ఆప్ఘనిస్థాన్, ఇంగ్లండ్ టీమ్స్ టీ-20, టెస్ట్ మ్యాచ్ల షెడ్యూల్ కూడా విడుదల చేసింది.