IPL 2023.. 65వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నేడు(మే 18న) హైదరాబాద్(hyderabad)లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. అయితే ప్లే ఆఫ్ రేసులో లేనప్పటికీ హైదరాబాద్(SRH) టీం గెలవాలని చూస్తుండగా..మరోవైపు బెంగళూరు జట్టు ఈ రేసులో ఉండాలంటే రెండు మ్యాచులు తప్పక గెలవాలి.
ఐపీఎల్ 2023లో బుధవారం (మే 17న) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన 64వ మ్యాచులో పంజాబ్ కింగ్స్(PBKS)పై ఢిల్లీ క్యాపిటల్స్(DC) 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో క్రికెటర్ సిరాజ్ కొత్త ఇల్లు నిర్మించాడు. ఇంటికి రావాలని కోరగా.. జట్టు సభ్యులు అంతా వచ్చారు. కోహ్లి, డుప్లెసిస్ తదితరులు రాగా.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది.
మూడు ఫార్మాట్లలో వంద కొట్టిన శుభ్ మన్ గిల్ ఐపీఎల్(IPL 2023)లోనూ అద్భుతంగా రాణించాడు. గత మ్యాచుల్లో తొంభైల్లోనే అతను నాలుగు సార్లు ఔటవ్వడం విశేషం. పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై 95 వద్ద ఔటైన అతను ఈ సారి సెంచరీ(Century) చేశాడు.
ధోనికి ఈ సీజన్ చివరిదని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులు కూడా ఆందోళన చెందుకున్నారు. ఒకవేళ ఇదే చివరిదైతే ధోనీని మరోసారి మ్యాచ్ లో చూసే అవకాశం ఉండకపోవచ్చు.
రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగళూరు 112 పరుగుల భారీ తేడాతో విక్టరీని నమోదు చేసింది. ఈ విజయంతో ఆర్సీబీ(RCB) పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది.