»India Has Shown Its Strength In The World Championship
World Championship: షూటింగ్లో తెలుగోళ్ల సత్తా
కొరియాలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్ పోటీలలో భారత్ సత్తా చాటుతోంది. ఈ పోటీలలో భారత్ 4 స్వర్ణాలు కైవసం చేసుకుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా స్వర్ణతోపాటు మరో పతకం కైవసం చేసుకున్నారు.
India has shown its strength in the World Championship
World Championship: భారతీయ యువత క్రీడల్లో ప్రపంచంతో పోటీ పడుతున్నారు. తాజాగా కొరియాలో చాంగ్వాన్(Changwon)లో ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు(World Championship Competitions) జరుగుతున్న విషయం తెలిసిందే. జూనియర్ షూటింగ్ విభాగంలో భారత్(India) మరో స్వర్ణం గెలిచింది. ఈ పోటీలో తెలంగాణ(Telangana)కు చెందిన ధనుష్ శ్రీకాంత్(Dhanush Srikanth), పార్థ్మానె, అభినవ్ షాలతో కూడిన భారత జట్టు (1886.7 పాయింట్లు) పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో పసిడి కైవసం చేసుకుంది. చైనా 1883.5 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అభినవ్‌కు ఈ టోర్నీలో ఇది రెండో స్వర్ణం. గౌతమితో కలిసి 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ మిక్స్డ్ టీమ్‌లోనూ అతడు మొదటి స్థానాన్ని సాధించాడు. మరోవైపు మహిళల స్కీట్‌లో రైజా థిల్లాన్ రజతం గెలుచుకుంది.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్(Air rifle) వ్యక్తిగత విభాగంలో విజయవాడకు చెందిన మద్దినేని ఉమామహేశ్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. క్వాలిఫికేషన్లో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు వచ్చిన మహేశ్, తుది పోరులో సత్తా చాటి మూడో స్థానాన్ని చేరుకున్నాడు. అతడు త్రుటిలో రజతాన్ని మిస్ అయ్యాడు. ఈ ప్రపంచకప్‌లో భారత్ 4 స్వర్ణ, 3 రజత, 3 కాంస్యాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. చైనా 4 స్వర్ణ, 5 రజత, 3 కాంస్యాలు ఫస్ట్ ప్లేస్ లో ఉంది.