వెస్టిండీస్(West Indies)ను భారత్ (India) చిత్తుగా ఓడించిన ఆనందంలో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన డ్యాన్స్ అదుర్స్ అనిపిస్తోంది. చాలా కూల్ గా కోహ్లీ డ్యాన్స్ చేశాడు. మైదానంలో చేతులు కదిలిస్తూ పైకి చూస్తూ అతడు చేసిన డ్యాన్స్ కి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.వెస్టిండీస్ లోని డొమినికాలో జరిగిన ఈ టెస్టు మ్యాచులో కోహ్లీ 76 పరుగులు చేశాడు.ఇక రోహిత్ తను ఫామ్ అందుకున్నట్లు నిరూపించుకున్నాడు. వీరితోపాటు మరో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఈ మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. కానీ తన 76వ సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీకి చాలాసార్లు లైఫ్ లు లభించాయి. అతను ఇచ్చిన క్యాచులను విండీస్ ఆటగాళ్లు నేలపాలు చేశారు.
కానీ చివరకు చెత్త షాట్ ఆడిన అతను పెవిలియన్ (Pavilion) చేరాడు. అప్పటికి అతని స్కోరు 76 కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో అరంగేట్ర ఆటగాడు జైస్వాల్‌తో కోహ్లీ 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja)తో 99 పరుగుల కీలక భాగస్యామ్యం నెలకొల్పాడు కోహ్లీ.ఈ క్రమంలోనే మ్యాచ్ గెలిచినా కూడా కోహ్లీని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.టెస్టుల్లో ఇప్పటి వరకు 28 శతకాలు చేసిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా తన 29వ టెస్టు సెంచరీ పూర్తి చేస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అది జరగలేదు. దీంతో వెస్టిండీస్ మీద కూడా ఆడలేకపోయాడంటూ అతన్ని విమర్శిస్తున్నారు. అన్నిసార్లు లైఫ్ దక్కినా కూడా సెంచరీ పూర్తి చేయలేకపోయాడని కోహ్లీని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. మరి రెండో టెస్టులో అయినా అతను ఈ ఎదురు చూపులకు బ్రేక్ వేస్తాడేమో చూడాలి.