బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు (Indian Women’s Team)108 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టీమిండీయా 50 ఓవర్లలో 228/8 స్కోర్ చేయాగా, అనంతరం బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్(Bangladesh) 120 రన్స్‌కు ఆలౌటైంది.తొలి వన్డేలో ఓటమికి భారత అమ్మాయిలు ప్రతీకారం తీర్చుకున్నారు. భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించింది. తొలుత బ్యాటింగ్.. ఆనక బౌలింగ్‌లో రాణించి జట్టును గెలిపించింది. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో (BAN W vs IND W) టీమ్ఇండియా 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
చదవండి :Breaking: పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్..ఎక్కడికక్కడ ఆగిపోయిన పలు రైళ్లు!
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 228/8 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 35.1 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బ్యాటర్ ఫర్గానా హక్ (Fergana Haq)(47), రితు మోని (27) మాత్రమే కాస్త పోరాడారు. భారత బౌలర్లలో జేమీమా రోడ్రిగ్స్ 4, దేవికా వైద్య 3.. మేఘ్నా సింగ్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా తలో వికెట్ తీశారు. బంగ్లా బ్యాటర్లను ఏమాత్రం క్రీజ్‌లో కుదురుకోనీయకుండా ఒత్తిడి పెంచి భారత బౌలర్లు వికెట్లు పడగొట్టారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లూ 1-1తో సమంగా నిలిచాయి. చివరి వన్డే మ్యాచ్ జులై 22న జరగనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన జెమీమా రోడ్రిగ్స్(Jemima Rodrigues)ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.