»Bcci Has Announced The Team To Participate In The Asian Games
BCCI: వారికి షాకిచ్చిన బీసీసీఐ..20 మంది ఆటగాళ్ల హార్ట్ బ్రేక్
ఆసియా గేమ్స్‌లో ఈసారి టీమిండియా క్రికెట్ టీమ్ పాల్గొనబోతోంది. అదే సమయంలో వన్డే ప్రపంచ కప్ కూడా జరగనుంది. దీని వల్ల కొందరు ఆటగాళ్లు ఆసియా గేమ్స్ లో ఆడే అవకాశాన్ని కోల్పోయారు. ఆసియా గేమ్స్‌కు ఆడే జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఆసియా క్రీడల్లో(Asian Games 2023) పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు(Indian cricket Team) సిద్ధమైంది. సెప్టెంబర్ 23వ తేది నుంచి టీమిండియా(Team India) ఆసియా క్రీడల్లో పాల్గొనబోతోంది. ఆ క్రీడల కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ(BCCI) ప్రకటించింది. అలాగే ఐదుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైగా ఉంచింది. ఎంపికైన ఆ జట్టుకు రితురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బీసీసీఐ ఈ మేరకు 20 మంది ఆటగాళ్ల హృదయాలను బద్దలు కొట్టే పని చేసింది.
ఆసియా క్రీడల(Asian Games 2023)కు సంబంధించిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆసియా గేమ్స్‌లో ఆడేవారు ప్రపంచ కప్ జట్టులో భాగం కాదని బీసీసీఐ తెలిపింది. రెండు టోర్నమెంట్లు ఒకేసారి ఆడటం వల్ల కొందరు ఆసియా క్రీడలకు, ఇంకొందరిని ప్రపంచ కప్ టోర్నీలకు బీసీసీఐ పంపనుంది. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23 నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 8న ముగుస్తాయి. వన్డే ప్రపంచకప్2023 అక్టోబర్ 5 నుంచి భారత్‌లో ప్రారంభం కానుంది. దీంతో ఆసియా గేమ్స్ టోర్నీకి 20 ప్లేయర్లు వెళ్లలేకపోతారు.