»First Test Victory Team India Has Created History Scored The Most Runs Without Losing A Wicket In Test Matches
Team India: తొలి టెస్ట్ విక్టరీ.. 91 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి.!
91 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ జరగని ఘనత భారత జట్టు చేసింది. 1932లో టీమిండియా తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ఆడిన నుంచి నేటి వరకు ఇదే అతిపెద్ద వికెట్ భాగస్వామ్యంగా నిలిచింది.
Team India has created history. scored the most runs without losing a wicket in Test matches
Team India: డొమనికా వేదికగా ఆడుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ (Team India)కు శుభారంభం లభించింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్ ను మూడ్రోజుల్లోనే ముగించింది. 312/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు 421/5 వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కరీబియన్ జట్టు అశ్విన్ (7/71) స్పిన్ మాయాజాలంతో 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఇన్నింగ్స్, 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే 91 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ జరగని ఘనత భారత జట్టు చేసింది. ఇండియన్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది.
1932లో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన నుంచి నేటి వరకు భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో ఎటువంటి వికెట్ కోల్పోకుండా ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యం చాటలేకపోయింది. తాజాగా వెస్టిండీస్‌పై టీమిండియా చరిత్ర సృష్టించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు వెస్టిండీస్(West Indies)ను 150 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్ నష్టపోకుండా 229 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది.
తొలి వికెట్‌కు ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ 229 పరుగులు జోడించారు. వెస్టిండీస్ స్కోరును వికెట్ నష్టపోకుండా 79 పరుగుల ఆధిక్యంతో అధిగమించి భారత్ చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఎలాంటి వికెట్ నష్టపోకుండా ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యం సాధించి భారత్ గొప్ప ఫీట్ సాధించింది. జైస్వాల్, రోహిత్ (103)తో కలిసి మొదటి వికెట్‌కు 229 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఇది ఆసియా వెలుపల భారతదేశం తరపున అతిపెద్ద మొదటి వికెట్ భాగస్వామ్యంగా నిలిచింది. 1979 ఆగస్టులో ది ఓవల్‌లో ఇంగ్లండ్‌పై తొలి వికెట్‌కు 213 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన చేతన్ చౌహాన్, సునీల్ గవాస్కర్ జోడీని జైస్వాల్, రోహిత్ అధిగమించారు. ఇది క్రికెట్ చరిత్రలో గొప్ప రోజుగా అభిమానులు భావిస్తున్నారు. ఇక రెండో టెస్టు జులై 20న మొదలుకానుంది.