ICC bans Indian women's cricket team captain Harmanprati Kaur
Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు(Violation of Code of Conduct) హర్మన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. కెప్టెన్ హర్మన్‌కు 4 డీమెరిట్ పాయింట్లు, మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత పెట్టింది. ఈ నిషేధం కారణంగా ఆసియా గేమ్స్ 2023(Asian Games 2023)లోని రెండు కీలక మ్యాచ్‌లకు ఆమె దూరం కానుంది.
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘన కింద హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanprati Kaur)ను రెండు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేశాం అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. లెవల్-2 తప్పిదం కింద హర్మన్ మ్యాచ్ ఫీజులో 50 శాతంతో పాటు 3డీ మెరిట్ పాయింట్లు అలాగే అంపైర్ పై ఆరోపణలు చేసినందుకు జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ విధించింది. తాజాగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో హర్మన్ దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్(Bangladesh)తో వన్టే సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో హర్మాన్ గ్రీజ్‌లో ఉండగా బంగ్లా బౌలర్ నహిదా అక్తర్(Nahida Akhtar) వేసిన బంతిని స్వీప్ షాట్ ఆడింది. బంతి బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్‌కు తాకింది. బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేయగా ఎల్బీడబ్ల్యూ(LBW) అంటూ అంపైర్ ఔట్ ఇచ్చాడు. అయితే బంతి లెగ్ స్టంప్‌కు బయట పిచ్ అయిందనుకున్న హర్మన్..అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అదే కోపంతో వికెట్లను బ్యాట్‌తో కొట్టింది. ఆ తర్వాత క్రీజ్ వదులుతూ అంపైర్లపై బహిరంగ విమర్శలు(Public criticism of umpires) చేసింది. బహుమతి ప్రదానోత్సవం సందర్భంలోనూ బంగ్లా ఆటగాళ్లపై విమర్శలు చేసింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఐసీసీ చర్యలు తీసుకుంది. దీని కారణంగా హర్మన్ ఒక టెస్టు మ్యాచ్, రెండు వన్డేలు లేదా రెండు టీ20లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఆసియా గేమ్స్ టీ20 ఫార్మాట్లో జరగనున్నాయి. కాబట్టి తొలి రెండు మ్యాచ్‌లకు హర్మన్ అందుబాటులో లేకుండా పోయింది. కీలక మ్యాచులకు భారత కెప్టెన్ అందుబాటులో ఉండకపోవడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి.