»Explosive Rohit Kohli Team India Scored A Huge Score On The First Day
WI vs IND: విజృంభించిన రోహిత్, కోహ్లీ..తొలి రోజు టీమిండియా భారీ స్కోర్
రెండో టెస్ట్ మొదటి రోజు టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగింది. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ మొదటి రోజు టెస్ట్‌లో అర్ధశతకాలు చేశారు. తొలి రోజు భారత్ స్కోర్ 288/4గా నిలిచింది.
వెస్టిండీస్(West Indies), టీమిండియా(Team India) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రెండో టెస్టు(Second Test)లో టీమిండియా భారీ స్కోరు దిశగా వెళ్తోంది. మొదటి రోజు ఆట ముగిసే టైంకి నాలుగు వికెట్ల నష్టానికి 288 రన్స్ చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 87 పరుగులు, రవీంద్ర జడేజా 36 పరుగులతో కొనసాగుతూ క్రీజ్‌లో ఉన్నారు. ఇకపోతే కెప్టెన్ రోహిత్ శర్మ 80 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ 57 పరుగులు, శుభ్‌మన్ గిల్ 10, అజింక్య రహానె 8 పరుగులు చేశారు. విండిస్ బౌలర్లలో కీమర్ రోచ్, గాబ్రియల్, వారికన్, జేసన్ హొల్డర్లు తలొక వికెట్‌ను తీశారు.
మొదట టాస్ ఓడిన భారత్(Team India) బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడారు. షార్ట్ బంతులతో భారత బ్యాటర్లను వెస్టిండీస్ బౌలర్లు ఇబ్బంది పెట్టాలని చూసినా లాభం లేకుండా పోయింది. రోహిత్ శర్మ(Rohit Sharma), జైస్వాల్‌లు తమదైన మార్క్‌తో సిక్సర్లను బాదారు. మొదటి నుంచి జైస్వాల్ దూకుడుగా ఆడుతూ వచ్చాడు. భోజన విరామం సమయానికి భారత్ స్కోర్ 121/0గా ఉంది. ఆ తర్వాత టీ విరామం సమయానికి ఆ స్కోర్ 182/4కు చేరింది.
తొలిరోజు నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా(Team India)ను విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆదుకున్నాడు. జడేజా సహకారంతో అతను అద్భుతం సాధించాడు. నిలకడగా బౌండరీలు బాదుతూ కోహ్లీ స్కోరును వేగాన్ని పెంచుతూ వెళ్లాడు. వెస్టిండీస్ బౌలర్ వారికన్ వేసిన 67వ ఓవర్లో కోహ్లీ ఫోర్ బాది 30వ అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. రెండో రోజు కూడా కోహ్లీ ఇదే ఆటతీరుతో ఆడితే భారత్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.