భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఫిట్నెస్ సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ సర్ణ పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) మళ్లీ బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నాడు. జూన్ 30 నుంచి లౌసన్నే వేదికగా ప్రారంభమయ్యే డైమండ్ లీగ్ (Diamond League) పోటీల్లో తాను పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపాడు. కండరాలు పట్టేయడంతో నీరజ్ నెల రోజుల నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడు. డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా పేరును కూడా జతచేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. నీరజ్ కాకుండా జెస్విన్ అల్డ్రిన్, శ్రీశంకర్ లాంగ్ జంప్‌లో పోటీపడనున్నారు.
‘‘జావెలిన్ త్రో (Javelin throw) విభాగంలో నీరజ్ చోప్రా పాల్గొంటాడు. అతడికి చెక్ రిపబ్లిక్ (Czech Republic) జాకుబ్, జర్మనీ అథ్లెట్ జులియన్ వెబెర్ నుంచి తీవ్ర పోటీ ఉంటుంది’’ అని డైమండ్ లీగ్ నిర్వాహకులు వెల్లడించారు. గత మేలో జరిగిన దోహా (Doha) డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా 88.67 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. ఈసారి 90 మీటర్ల మార్క్‌ను తాకాలని అభిమానులు ఆశిస్తున్నారు. డైమండ్ లీగ్ నిర్వాహకులు కూడా జావెలిన్ త్రో ఈవెంట్లో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో 25 ఏళ్ల చోప్రా పేరును చేర్చారు. ఈ టోర్నీలో నీరజ్ చోప్రాకు జాకుబ్ వడ్లెజ్(Jakub Wadlej) (చెక్ రిపబ్లిక్), జూలియన్ వెబర్ (జర్మనీ) నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.