విద్యార్థుల బ్యాగు బరువు (Bag weight) విషయంలో కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ మార్గదర్శకాలను ఫాలో కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, స్కూల్ బ్యాగ్ గరిష్ఠ బరువు, విద్యార్థి బరువులో 15 శాతానికి మంచకూడదు. ఫస్ట్, సెకండ్ క్లాస్ పిల్లల బ్యాగులు 1.5 కిలోలు, 3,4 -తరగతులకు 2-3కిలోల బరువు, 6, 8 తరగతులకు 3-4కిలోలు, 9,10 క్లాసుల వారికి 4-5 కిలోల బరువు ఉండాలని ఈ ఉత్తర్వులను తప్పకుండా అమలయ్యేలా చూడాలని బ్లాక్ స్థాయి విద్యాధికారులను కోరింది. అలాగే స్కూల్లో వారానికి ఒకసారి.. ముఖ్యంగా శనివారంలో ‘నోబ్యాగ్ డే’(Nobag Day) జరుపుకోవాలని జీవో లో తెలిపింది. సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత ఈ మధ్యే బడులు ఓపెన్ అయిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ పిల్లలు పాఠశాలలకు పరుగులు తీస్తున్నారు. ఇదిలా ఉండగా.. విద్యార్థులు స్కూలుకు తీసుకెళ్లే బ్యాగుల అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. పరిమితికి మించి బ్యాగులు వెయిట్ ఉండటంతో విద్యార్థులకు భారంగా మారిందని పలువురు భావిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల (Government school) సంగతి పక్కన పెడితే.. ప్రయివేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు బ్యాగులు భారంగా మారుతున్నాయనే విషయంపై విపక్ష పార్టీలు (Opposition parties) సైతం మండిపడుతున్నాయి. విద్యార్థులకు అతి భారం మోపుతున్నస్కూల్స్పై చర్యలు తీసుకోవాలని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. కమిటీ (Dr VP Niranjanaradhya Committee)ఇచ్చిన సూచనల ఆధారంగా ఈ సర్క్యులర్లు జారీ చేసింది. స్కూల్ బ్యాగ్‌ల బరువు వల్ల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం (State Govt) ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అన్నీ పరిశీలించి బ్యాగ్‌లు ఎంత బరువుండాలో తేల్చి చెప్పింది. ఎప్పుడో ఈ కమిటీని ఏర్పాటు చేయగా..2018-19లో ఫైనల్ రిపోర్ట్‌ని అందించింది. 2019లో కర్ణాటక ప్రభుత్వం అన్ని స్కూల్స్‌కీ ఆదేశాలిచ్చింది. విద్యార్థి బరువులో 10% కి మించకుండా స్కూల్ బ్యాగ్ బరువు ఉండాలని తేల్చి చెప్పింది.