నేటి ఐపీఎల్(IPL 2023) మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ(RCB) ఘన విజయం(Victory) సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 24 పరుగులతో ఆర్సీబీ(RCB) ఘన విజయం సాధించింది.
మొహలీ వేదికగా జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్(IPL 2023)లో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), ఫాఫ్ డుప్లెసిస్ అర్థశతకాలు చేశారు. వీరిద్దరే తొలి వికట్ కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోహ్లీ 59 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ ఆటగాడు హర్ ప్రీత్ బ్రార్ 2 వికెట్లు తీయగా నాథన్ ఎల్లిస్, ఆర్ష్ దీప్ సింగ్ చెరో వికెట్ ను తీశారు.
ఈ మ్యాచ్ లో 600 ఫోర్లు కొట్టిన నాలుగో క్రికెటర్ గా విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డు నెలకొల్పాడు. పంజాబ్ కింగ్స్ జట్టు సభ్యులు పేలవ ప్రదర్శన కనబరిచారు. పవర్ ప్లేలో ఆర్సీబీ(RCB) బౌలర్లు అద్భుత ఆటతీరును చూపారు. మహ్మద్ సిరాజ్(Mahammad siraj) 4 వికెట్లను పడగొట్టి పంజాబ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. పంజాబ్ 6 ఓవర్లలోనే 4 వికెట్లు నష్టపోయింది. ఆఖరికి 10 వికెట్లను కోల్పోయి పంజాబ్ జట్టు(Punjab Kings) కేవలం 150 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 24 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది.