కీలక మ్యాచులో టీమిండియా బంగ్లాదేశ్(bangladesh) జట్టుపై ఘన విజయం(india won) సాధించింది. ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా 185 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. కానీ వర్షం కారణంగా బంగ్లా టార్గెట్ను 16 ఓవర్లకు 151 పరుగులు టార్గెన్ ను అంపైర్లు నిర్దేశించారు. దీంతో ఛేదనలో బంగ్లా ఆటగాళ్లను భారత బౌలర్లు తీవ్రంగా కట్టడి చేశారు.
ఈ నేపథ్యంలో అర్షదీప్, హార్దిక్ పాండ్యా చెరో ఇద్దరిని ఔట్ చేయగా…షమీ ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నారు. మరోవైపు తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ 64 రన్స్, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ, సూర్య కుమార్ యాదవ్ 30 పరుగులు చేసి ఆదరగొట్టారు. ఈ విజయంతో టీమిండియా సెమీఫైనల్ ఆవకాశాలను సజీవం చేసుకుంది.