»India Vs Australia 3rd Odi Live Streaming Venue Match Time Weather Update
IND vs AUS 3rd ODI: భారత్ – ఆస్ట్రేలియాల మధ్య మూడో వన్డే వర్షార్పణం కానుందా ?
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో టీమిండియా 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో టీమిండియా 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య సిరీస్‌లో మూడో వన్డే సెప్టెంబర్ 27న రాజ్‌కోట్‌లో జరగనుంది. రాజ్‌కోట్ వన్డే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూలను క్లీన్ సీప్ చేయాలని భారత జట్టు భావిస్తోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు కూడా తొలి విజయంపై కన్నేసింది.
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వేదికగా బుధవారం జరిగే మూడో వన్డేలో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అయితే ఆ రోజు రాజ్‌కోట్‌లో వాతావరణం ఎలా ఉండబోతుంది? వాస్తవానికి బుధవారం రాజ్‌కోట్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. కాగా కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చినుకులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అయితే మ్యాచ్ జరిగే రోజు రాజ్‌కోట్‌లో భారీ వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది.
స్పోర్ట్స్-18లో భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డే మ్యాచ్‌ను భారత అభిమానులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు. ఇది కాకుండా, జియో సినిమాలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొహాలీలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అదే సమయంలో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఇప్పుడు సిరీస్‌లో మూడో వన్డే రాజ్‌కోట్‌లో జరగనుంది.