ఆసియా కప్ గెలిచిన తర్వాత టీమిండియా మరింత జోష్ మీదుంది. ఈ తరుణంలోనే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఆడనుంది. ఈ మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మొదటి రెండు మ్యాచుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యలకు రెస్ట్ ఇచ్చింది. అలాగే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన అక్షర పటేల్‌ను బీసీసీఐ పక్కన పెట్టింది. ఆ స్థానంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను రంగంలోకి దింపనుంది.
రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో మొదటి రెండు మ్యాచులకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నారు. హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మకు తొలి వన్డేలో చోటు లభించింది. మూడో వన్డేకు రోహిత్, కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు టీమ్‌తో కలవనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
షెడ్యూల్:
మొదటి వన్డే మ్యాచ్ సెప్టెంబర్ 22న మొహాలీ స్టేడియంలో జరగనుంది. రెండో వన్డే సెప్టెంబర్ 24న ఇండోర్ స్టేడియంలో జరగనుంది. మూడో వన్డే మ్యాచ్ సెప్టెంబర్ 27న రాజ్‌కోట్ క్రీడా మైదానంలో నిర్వహించనున్నారు.