వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా చెన్నై (Chennai) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా(Australia) 49.3 ఓవర్లలో 199 పరుగులుకి కుప్పకూలింది. భారత స్పిన్నర్లు అదరగొట్టారు.. స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 46; 5×4), వార్నర్(52 బంతుల్లో 41; 6×4) బాగానే రాణించారు. మార్నస్ లబుషేన్(27), గ్లెన్ మ్యాక్స్‌వెల్(15), ప్యాట్ కమిన్స్(15) నామమాత్రపు స్కోరు చేశారు. ఇక చివర్లో వచ్చిన స్టార్క్ (28). రాణించాడు.అడం జంపా(6), జోష్ హెజిల్వుడ్(1*) స్కోర్ చేశారు. స్పిన్నర్లకే అనుకూలమైన చెపాక్ పిచ్‌పై భారత బౌలర్లు అదరగొట్టారు. జడేజా(Jadeja) (3/28) మ్యాజిక్ చేశాడు. కుల్దీప్ (2/42), అశ్విన్ (1/34) చక్రం తిప్పారు. పేసర్ బుమ్రా (2/35) కూడా రాణించగా.. సిరాజ్, హార్దిక్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా(India)కు వరుసగా బిగ్ షాక్ ఇచ్చారు ఆసీస్ బౌలర్లు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ముగ్గురు ఖాతా తెరవకుండానే 0 పరుగులకు ఔట్ అయ్యారు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి 2 పరుగులు మాత్రమే చేసి 3 టాప్ ఆర్డర్ కీలక వికెట్లను కోల్పోయింది.మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్, స్లిప్‌లో కామెరూన్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక 6 బంతులు ఆడిన రోహిత్ శర్మ, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 3 బంతులు ఆడి హెజిల్ వుడ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన రాహుల్ తో కలిసి విరాట్ కోహ్లీ(Virat Kohli) మ్యాచ్ ను విజయం దిశగా నడిపించాడు. ఇందులో కోహ్లీ 85, రాహుల్ 97 పరుగులతో రాణించారు దీంతో భారత్ 52 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.