»Gujarat Titans Victory Over Delhi Sai Sudarshan Super
Gujarat Titans : ఢిల్లీపై గుజరాత్ టైటాన్స్ విక్టరీ..సాయి సుదర్శన్ సూపర్…
దిల్లీ (Delhi) వేదికగా జరిగిన ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వరుసగా రెండో విజయం నమోదు చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్బుత ప్రదర్మన చేసింది. వరుసగా రెండో విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో(Delhi Capitals) జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది.
దిల్లీ (Delhi) వేదికగా జరిగిన ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వరుసగా రెండో విజయం నమోదు చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్బుత ప్రదర్మన చేసింది. వరుసగా రెండో విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో(Delhi Capitals) జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. 163 పరుగుల లక్ష్యాన్ని టైటాన్స్ జట్టు 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఛేదించింది. యువ బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్ (Sai Sudarshan) అద్భుత ఇన్నింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ ను గెలుపుతీరాలకు చేర్చాడు. ఎడమచేతివాటం సాయి సుదర్శన్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 31 పరుగులు చేసి టైటాన్స్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆల్ రౌండర్ విజయ్ శంకర్ (Vijay Shankar) 29 పరుగులు చేశాడు.
ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (14), శుభ్ మాన్ గిల్ (14), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (5) స్వల్ప స్కోర్లకే అవుటైనా… గుజరాత్ టైటాన్స్ నెగ్గిందంటే అది సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ వల్లే! లక్ష్యఛేదనలో ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా సుదర్శన్ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌కు గుజరాత్ కళ్లెం వేసింది. అయితే వరుసగా వికెట్లను చేజార్చుకున్న దిల్లీ.. అక్షర్ పటేల్ దూకుడుతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ వార్నర్ 37 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) 30 పరుగులు చేశారు. చివర్లో అక్షర్ పటేల్ (Akshar Patel) 36 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్ తలో 3 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఆన్రిచ్ నోర్కియా 2, ఖలీల్ అహ్మద్ 1, మిచెల్ మార్ష్ 1 వికెట్ తీశారు. ఢిల్లీ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి.