Guy Whittall: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు కుక్క

జింబాబ్వేకు చెందిన మాజీ క్రికెటర్ గై విట్టాల్‌కు భారీ ప్రమాదం తప్పింది. ఆయన చిరుత దాడి చేయగా అప్రమత్తం అయిన పెంపుడు కుక్క అతడి ప్రాణాలు కాపాడింది. ఈ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

  • Written By:
  • Updated On - April 25, 2024 / 03:31 PM IST

Guy Whittall: జింబాబ్వేకు చెందిన మాజీ క్రికెటర్‌ గై విట్టాల్‌(Guy Whittall)పై చిరుత దాడి చేసింది. అప్రమత్తం అయిన పెంపుడు కుక్క ఆయన ప్రాణాలు కాపాడింది. ఈ విషయాన్ని వివరిస్తూ గై విట్టాల్ సతీమణీ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. ఇక విషయం ఏంటంటే 51 ఏళ్ల మాజీ ఆల్‌ రౌండర్‌ గై విట్టాల్‌ హ్యూమని ఏరియాలో ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ఆయనతో పాటే పెంపుడు కుక్క చికారాను తోడుగా తీసుకెళ్లాడు. అక్కడే అడవిలో ఓ పర్వతాన్ని అధిరోహిస్తున్న తరుణంలో ఓ చితరుత విట్టాల్‌పై అనుహ్యంగా దాడి చేసింది. వెంటనే అప్రమత్తం అయిన విట్టాల్ చిరుతను నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న కుక్క చికారా మొరుగుతూ చిరుతపై దాడి చేసింది. ఏ మాత్రం దానికి భయపడకుండా యజమానిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించింది.

చదవండి:Kenya: భారీ వర్షాలు.. 38 మంది మృతి

ఈ క్రమంలో కుక్క కూడా తీవ్రంగా గాయపడింది. రక్తమోడుతున్నా పోరాటం ఆపకుండా చిరుతను బెధిరించింది. దాంతో విట్టాల్ తీవ్రమైన గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. వెంటనే అటవి శాఖ అధికారులకు సమాచారం అందించారు. విట్టాల్‌కు ప్రథమ చికిత్స చేసి కుక్కను విమానంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికారా కోలుకుంటుంది. అలాగే విట్టాల్‌కు శస్త్రచికిత్స జరిగింది. ఇదే విషయాన్ని పంచుకున్న అతని భార్య హన్నా స్టూక్స్ ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి మెరుగ్గా ఉందని వెల్లడించారు. అయితే గతంలో కూడా గై విట్టాల్ ఓ భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని పేర్కొంది. 2013లో ఆయన ఇంట్లోకి భారీ మొసలి చొరబడింది. ముందుగానే విషయం తెలియడంతో రెస్క్యూ టీమ్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో వారి ప్రాణాలను ఎలాంటి అపాయం జరగలేదు.

చదవండి:South Korea: బిడ్డను కనే దంపతులకు సౌత్ కొరియా బంపర్ ఆఫర్