Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదర్కొంటున్నఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన్ను ఇండియాకు రప్పించడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసం ప్రత్యేకమైన దర్యాప్తు బృందం విచారణ చేస్తుంది.
Prajwal Revanna: లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై (Prajwal Revanna) పరారీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే సంచలనమైన ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను నియమించారు. వీరి ముందు రేవణ్ణ హాజరు కాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. గత మూడు వారాలుగా పరారీలో ఉన్న ప్రజ్వల్ జర్మనీ పారిపోయినట్లు తెలుసుకున్నారు. అయితే అతను ఫ్లైట్‌లో కాకుండా రైల్లో వెళ్లాడని సిట్ ధ్రువీకరించుకుంది.
ఆయన్ను భారత్‌కు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని విఫలం అవుతున్నాయి. ఇప్పటికే చాలాసార్లు టికెట్లు బుక్ చేసుకొని చివరి నిమిషంలో క్యాన్సెల్ చేసుకున్నాడు. దీంతో చేసేది ఏమిలేక సిట్ కోర్టును ఆశ్రయించింది. విచారించిన కోర్టు అరెస్టు వారెంటును జారీ చేసింది. ఇప్పటికే ప్రజ్వల్‌పై ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. అతన్ని కట్టడి చేసేందుకు బ్యాంక్ ఖాతాలను నియంత్రించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. లైంగిక ఆరోపనలో కేసులో ప్రజ్వల్ తండ్రి హెచ్.డి.రేవణ్ణ అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రజ్వల్ దోషిగా తేలితే న్యాయస్థానాలు ఏ శిక్ష అయినా వేసుకోవచ్చని తాత, మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ పేర్కొన్నారు.