»Horoscope Today Todays Horoscope 2024 May 19th Will Hear Good News
Horoscope: నేటి రాశిఫలాలు
ఈ రోజు(2024 April 19th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. మీమీరంగాల్లో నష్టపోమే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ఒక మంచి అవకాశం చేజారుతుంది. ఆకస్మిక ధననష్టం ఉంది.
వృషభం
మొదలుపెట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు తొలగిపోతాయి.శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి.
మిథునం
పట్టుదలతో కొన్ని పనులు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి. మీమీ రంగాల్లో గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
కర్కాటకం
ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబ సౌఖ్యం ఉంది. సన్నిహితులను కలుస్తారు. సమాజంలో గౌరవం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ప్రతీ విషయంలో అభివృద్ధి సాధిస్తారు.
సింహం
మొదలుపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితల వలన ఆందోళన చెందుతారు.
కన్య
కుటుంబలో కలహాలు ఏర్పడుతాయి. చెడు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.
తుల
మొదలు పెట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధం కలిగే అవకాశం ఉంది. స్త్రీల వలన బాధలు ఉన్నాయి. ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది.
వృశ్చికం
విందులు, వినోదాలకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. మానసిక ఆందోళన చెందుతారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
ధనుస్సు
సమాజంలో గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభాలు ఉన్నాయి. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. సన్నిహితులను గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది.
మకరం
కొన్ని పనులు వాయిదా వేసుకోక తప్పదు. మానసిక చంచలంతో ఇబ్బంది పడుతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త అవసరం. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు.
కుంభం
ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి మెండు. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని పొందుతారు.
మీనం
అనవసరమైన భయాందోళనలు ఉండవు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. మీమీరంగాల్లో స్థానచలన సూచలనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. రుణప్రయత్నాలు చేస్తారు.