కెన్యాలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించి ఇప్పటివరకు సుమారుగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
Kenya: కెన్యాలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించి ఇప్పటివరకు సుమారుగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వర్షాల ధాటికి దేశంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రాంతాలన్ని మొత్తం పూర్తిగా నీట మునిగాయి. ఈ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రధాన రహదరారులపై చెట్లు కూలడంతో రవాణా స్తంభించింది. కిటెంగెలాలోని అథి నదికి వరదలు రావడంతో వేలాది మంది వ్యాపారవేత్తలు, కార్యాలయ ఉద్యోగులు చిక్కుకుపోయారు. భారీ వర్షాలు దేశవ్యాప్తంగా కనీసం 23 కౌంటీలను ప్రభావితం చేశాయి. 1,10,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 27,716 ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని, సుమారుగా 5,000 పశువులు చనిపోయాయని కెన్యా రెడ్ క్రాస్ సొసైటీ తెలిపింది.