జూనియర్ పురుషుల జట్టు ఆసియాకప్ హాకీ టోర్నమెంట్ విజేతగా భారత్ నిలిచింది. టోర్నీ మొత్తం నిలకడైన ప్రదర్శన కనబర్చిన భారత జట్టు ఫైనల్లో 5-3 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసి టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో వరుసగా మూడోసారి జూనియర్ ఆసియాకప్‌ను భారత్ కైవసం చేసుకుంది.