ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ తండ్రి రోహిత్, ధోనీ, కోహ్లీ, ద్రవిడ్‌లకు క్షమాపణ చెప్పాలని అన్నాడు. లేదంటే ఇప్పుడిప్పుడే జట్టులో నిలదొక్కుకుంటున్న సంజూ కెరీర్‌పై అతడి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నాడు. భారత్‌లో ప్రతిభకు కొదవ లేదు.. కానీ, క్రికెటర్స్ తమ నోరు అదుపులో పెట్టుకొని విమర్శకులకు బ్యాటుతోనే సమాధానం చెప్పాలని సూచించాడు.