»Amit Shah Met With Wrestlers Star Wrestler Who Left The Protest
Saksi malik : రెజ్లర్లతో అమిత్ షా భేటీ.. నిరసన నుండి తప్పుకున్న స్టార్ రెజ్లర్!
తాజాగా, భారతీయ రైల్వేలో OSDగా చేరారు సాక్షి మాలిక్ (Saksi malik), బజరంగ్ పునియా, వినేశ్ ఫోగాట్. రెజ్లర్ల ఉద్యమం ఇక నీరుగారిపోయినట్లేనని విమర్శలు వస్తున్నాయి.
మహిళా రెజ్లర్స్ చేపట్టిన ఆందోళనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఆందోళన నుండి ప్రముఖ రెజ్లర్లు సాక్షి మాలిక్ (Saksi malik)తప్పుకుంది. తన ఆందోళనను విరమిస్తున్నట్లు సాక్షి మాలిక్ తెలిపింది. తిరిగి తన రైల్వే జాబ్‌లో చేరనున్నట్లు సాక్షి మాలిక్ ప్రకటించింది. కాగా, గత రెండు రోజుల క్రితమే బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) వ్యవహరంపై చర్చించేందుకు సాక్షి మాలిక్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)తో భేటీ అయ్యింది.ఈ సమావేశం జరిగిన రెండు రోజులకే రెజ్లర్లు సీరియస్‌గా చేస్తోన్న ఆందోళన నుండి సాక్షి మాలిక్ తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇక, బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని ఈ నెల 9వ తేదీ వరకు కేంద్రానికి డెడ్ లైన్ విధించిన రెజ్లర్లు.. అప్పటిలోగా అతడిని అరెస్ట్ చేయకపోతే తమ పతకాలను గంగా నదిలో పడేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.శనివారం రాత్రి మంత్రి అమిత్ షాను కలిసినట్లు పునియా తెలిపారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ (Wrestling Federation) అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ కొంతకాలంగా రెజ్లర్లు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రిజ్ భూషన్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) వంటి క్రీడాకారులు ఆరోపించారు. పోలీసులు, ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరసనకు దిగారు. రెజ్లర్ల దీక్షకు తాజాగా ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, క్రీడాకారులు, వివిధ రంగాల ప్రముఖులు మద్దతు తెలిపారు. ఈ ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. కాగా, ఈ విషయంలో నిష్పాక్షక దర్యాప్తు జరిగేలా చూస్తానని అమిత్ షా చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వారికి హామీ ఇచ్చారు.ఇప్పటికే బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఐదు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఈ గడువు ముగుస్తుండటంతో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లు తమ నిరసన ఆలోచనను తాత్కాలికంగా విరమించుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ వేగంగా సాగుతోంది. బ్రిజ్ భూషన్ సింగ్‌పై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు (Delhi Police) ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.