మెల్బోర్న్ టెస్టులో సెంచరీ చేసిన నితీశ్ రెడ్డిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. అతనికి మొదటి టెస్టు సెంచరీ, భవిష్యత్‌లో మరిన్ని పరుగులు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. తల్లిదండ్రుల త్యాగాల వల్ల ఈ స్థాయికి చేరుకున్నాననే విషయాన్ని మర్చిపోవద్దని సూచించాడు. భవిష్యత్‌లోనూ ఇదే విధంగా ఆడితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు.