పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మార్క్రమ్ 37, తెంబా బావుమా 40 పరుగులతో రాణించారు. అయితే, వరుసగా వికెట్లు కోల్పోయిన సమయంలో కగిసో రబాడ 31* కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు.