బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో నాలుగో రోజు టీమిండియా 369 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ఆధిక్యం 105 పరుగులకు చేరింది. భారత బ్యాటర్లలో నితీష్ 114, జైస్వాల్ 82, సుందర్ 50 రన్స్‌తో రాణించారు. ఆసీస్ బౌలర్లలో కమీన్స్, బొలాండ్ లయన్‌కు తలో 3 వికెట్లు పడగొట్టారు. నిన్నటి స్కోర్‌కు కేవలం 11 పరుగులు మాత్రమే జోడించి భారత జట్టు ఆలౌట్ అయింది.