ముంబైలో జరిగిన హ్యారిస్ షీల్డ్ టోర్నీలో సంచలనం నమోదైంది. 15 ఏళ్ల యువ బ్యాటర్ ఆయుశ్ షిండే కేవలం 152 బంతుల్లోనే 43 ఫోర్లు, 24 సిక్సర్లతో 419 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ తరుఫున ఆడిన ఆయుశ్.. పార్లే తిలక్ విద్యామందిర్తో జరిగిన మ్యాచ్లో ఈ రికార్డు నెలకొల్పాడు. ‘ఈ మ్యాచ్లో 500 పరుగులు చేద్దామనుకున్నా.. కానీ ఓవర్లు ముగియడంతో సాధ్యపడలేదు’ అని మ్యాచ్ అనంతరం ఈ యువ బ్యాటర్ తెలిపాడు.