ఎలైట్ పురుషుల, మహిళల జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రేటర్ నోయిడా వేదికగా జరిగే ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది బాక్సర్లు తలపడుతున్నారు. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్, ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బొర్గోహై వంటి స్టార్ ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.