బాక్సింగ్ డే టెస్ట్ నాలుగో రోజు జరిగిన మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ మూడు క్యాచ్‌లు జారవిడిచాడు. ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, కమిన్స్ ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేశాడు. దీంతో జైస్వాల్‌పై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. ‘అరే జస్సూ.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా..? బాల్ ఆడేదాకా కిందే ఉండు’ అంటూ ఆగ్రహానికి గురయ్యాడు.