ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ వచ్చే ఏడాది కేరళకు రానున్నారు. కేరళలో జరిగే అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచ్లో అర్జెంటీనా జట్టుతో పాటు ఆయన పాల్గొనున్నారు. ఈ విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఫేస్ బుక్ ద్వారా అనౌన్స్ చేశారు. 2011లో కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజులాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో ఆడేందుకు మెస్సీ భారత్కు చివరి సారిగా వచ్చారు.