ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఈరోజు కీలక మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించేది పాక్ ఆటగాడేనంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. పాక్ ఓపెనర్ సైమ్ ఆయుబ్ ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఒక్క పరుగు కూడా చేయలేదు. UAE, భారత్, ఒమన్‌తో జరిగిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్ అయ్యాడు. దీంతో ఆయుబ్ వల్ల పాక్ ఓడిపోయే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.