ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగో టెస్టు భారత జట్టు ఎంపికపై మాజీ స్పిన్నర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కరుణ్ నాయర్‌పై వేటు వేయాలని భావిస్తే అతడి స్థానంలో సాయి సుదర్శన్ ఎంపిక చేయాలని సూచించాడు. ఒకవేళ అభిమన్యు ఈశ్వరన్‌కు అవకాశం ఇస్తే, అతను సరిగా ఆడకపోతే ఒక్క మ్యాచ్‌తోనే బెంచ్‌కు పరిమితమవుతాడని పేర్కొన్నాడు.