బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో 5 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించిన న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ అరుదైన రికార్డును నమోదు చేశాడు. న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. కేవలం 26 మ్యాచ్‌ల్లోనే హెన్రీ ఈ రికార్డు నెలకొల్పాడు. అతడు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 13.2 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.