ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ చెత్త రికార్డు నమోదు చేశాడు. వర్షం కారణంగా మ్యాచును 39 ఓవర్లకు కుదించగా.. స్టార్క్ వేసిన ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్ 28 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో వన్డే మ్యాచులో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు(28) సమర్పించుకున్న ఆసీస్ బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు డోహర్టి(26 పరుగులు) పేరిట ఉండేది.