Siddaramaiah Is The Best Option To CM Post:Yatindra
Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ గెలవడం, అధికారంలోకి రావడం ఖాయమైపోయిన తరుణంలో ఇప్పుడు మరో కొత్త అంశం తెరమీదకొచ్చింది. కర్ణాటక తదుపరి సీఎం ఎవరు అవుతారనే ఈ ప్రశ్నకి సమాధానం వెతికే పనిలో ఇప్పుడు కాంగ్రెస్ తలమునకలువుతోందట.
బీజేపీ ఓటమి ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ రోజు సాయంత్రమే తన పదవికి రాజీనామా చేయబోతున్నారట. కాగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. దీంతో ఈ అంశంపై ఆదివారం కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా.. సీఎం పదవి కోసం కర్ణాటక కాంగ్రెస్లో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. మొదటిది ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేరు కాగా, రెండోది సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య పేరు.
వీరిద్దరూ సీఎం పదవి కోసం పోటీ పడుతుండడంతో కాంగ్రెస్ అధికాష్ఠానం ఎవరిని సీఎంగా కూర్చోబెట్టే అవకాశాలున్నాయోనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే ఒకరిని సీఎంగా కూర్చోబెట్టిన తర్వాత మరొకరిని ఎలా బుజ్జగిస్తారో కూడా ఆసక్తికరంగానే మారింది.