ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతల దౌర్జన్యానికి అవధుల్లేవని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. చంద్రబాబుకు నిరసనగా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు చేపట్టిన సైకిల్ యాత్రలో టీడీపీ నేతలపై దౌర్జన్యం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని మోహ్లా-మాన్‌పూర్ జిల్లా సర్ఖేడాలో నక్సలైట్ల కాల్పుల్లో బీజేపీ నేత బిర్జు తారామ్ మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నరకు జరిగిన కాల్పుల్లో ఈ ఘటన జరిగింది. అయితే ఇటివల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ వచ్చి నక్సెలైట్లను అణచి వేస్తామని చెప్పిన ఒకరోజు తర్వాతే ఇది జరగడం విశేషం.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయభేరి యాత్రలో భాగంగా రోడ్డు పక్కన ఓ టిఫిన్ కేంద్రంలో దోశ వేశారు. అంతేకాదు అక్కడే ఉండి కాసేపు ఆ షాపు యాజమానితో మాట్లాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)ని మోసం చేసి ముందుగానే టోల్ వసూలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు అతని బ్యాంక్ బ్యాలెన్స్, ఖాతాలను సీజ్ చేసింది.
ఆంధ్రప్రేదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే ధీటుగా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. సీఎం మా పార్టీ అధినేత అంటే.. మా పార్టీ నేత అంటూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) సీఎం పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
దేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన పార్లమెంటులో ప్రశ్నలు అడిగితే కూడా డబ్బులు ఇస్తారా? అంటే అస్సలు ఛాన్స్ లేదని అంటారు రాజకీయ నిపుణులు. కానీ ఓ ఎంపీ మాత్రం డబ్బుల కోసమే ప్రశ్నలు అడిగారనే ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ గడువు పూర్తికావడంతో కారాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తన భద్రత విషయంలో ఆందోళన ఉందని న్యాయాధికారితో చెప్పారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఈ క్రమంలో రేపు బోధన్, నిజామాబాద్లో జరగనున్న బస్సు యాత్రను క్యాన్సిల్ చేశారు. అయితే అత్యవసరంగా రాహుల్ ఢిల్లీ వెళ్లనున్న క్రమంలో ఈ మేరకు అనౌన్స్ చేశారు.
మోడీ ప్రభుత్వం స్కూళ్లు తెరుస్తుంటే..ఇక్కడి అధికార ప్రభుత్వం మద్యం షాపులను తెరుస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో కీలక కాంగ్రెస్ నేత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బైక్ ర్యాలీలో భాగంగా ఆమె పాల్గొన్న క్రమంలో స్కూటీ నుంచి కిందపడగా ఆమెకు గాయలయ్యాయి. దీంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(dk shiva kumar)కు గట్టి షాక్ ఎదురైంది. సీబీఐ తనపై పెట్టిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కొట్టివేయాలని ఆయన వేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు సీబీఐ సంస్థను ఆదేశించింది కూడా.
నిన్నటి వరకు పారదర్శకంగా పనిచేస్తుందన్న టీఎస్‌పీఎస్సీ బోర్డును నేడు కేటీఆర్ ప్రక్షాళన చేస్తామని అంటున్నారు. ఇది కాదా దిగుజారుడు రాజకీయాలు అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆగ్రహజ్వాలల్లోనే మీ ప్రభుత్వం మంట కలిసిపోతుందని, నిరుద్యోగ ద్రోహులుగా మీరు మిగిలిపోతారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దేశంలోనే అవినీతి అంతా ఇక్కడే ఉందని భూపాలపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ బస్సు యాత్రలో రాహుల్ ఆరోపించారు. ఇంకా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతానికి ఇప్పటికి రాష్ట్రం మారలేదు, బడ్జెట్ మారలేదని..రాష్ట్రంలో మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమేనని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో జరగని అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి మారడం వల్లనే సాధ్యమైందని అన్నారు.