»Congress Leader Rahul Gandhi Making Dosa At A Roadside Tiffin Shop As Part Of His Vijayabheri Yatra This Video Is Currently Going Viral On Social Media
Rahul Gandhi: దోశ వేసి తినిపించిన రాహుల్ గాంధీ..నెటిజన్ల కామెంట్స్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయభేరి యాత్రలో భాగంగా రోడ్డు పక్కన ఓ టిఫిన్ కేంద్రంలో దోశ వేశారు. అంతేకాదు అక్కడే ఉండి కాసేపు ఆ షాపు యాజమానితో మాట్లాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
Rahul Gandhi: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విజయభేరి యాత్రలో భాగంగా నిన్న జగిత్యాలలో పర్యటించారు. అందులో భాగంగా నూకపల్లి బస్టాండ్ దగ్గర ఆగి పక్కనే ఉన్న ఓ హోటల్లోకి ప్రవేశించి సరదాగా దోశలు వేశారు. అచ్చం మాస్టర్ చెఫ్ మాదిరిగా వేసి దానిని అక్కడున్న దోశ సెంటర్ యాజమానికి తినిపించి ఎలా ఉందని అడిగారు. ఆ క్రమంలో అతను కూడా దోశను రాహుల్ కు కొంచెం తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే వ్యాపారం ఎలా నడుస్తుందని, ఎంత ఆదాయం వస్తుందని టిఫిన్ షాపు యాజమానితో రాహుల్ కాసేపు మాట్లాడారు. రాహుల్ దోశ వేస్తున్న క్రమంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
అయితే రాహుల్ దోశలు వేసే క్రమంలో వాటి తయారీ విధానం గురించి అక్కడున్న దోశల కేంద్ర యాజమానిని అడిగి తెలుసుకున్నారు. దోశలు ఇలా వేయాలని షాపు యాజమాని చెప్పారు. ఆయన పక్కనుండి చెబుతున్న క్రమంలోనే రాహుల్ దోశ వేశారు. వేడి పెనం మీద దోశ పిండిని వేసి, ఓ గిన్నెతో తిప్పి రాహుల్ దోశ చేశారు. తర్వాత రాహుల్ గాంధీ ఆ టిఫిన్ను తిని చాలా బాగుందని చెప్పారు. అయితే రాహుల్ దోశ వేయడం చూసిన కొందరు నెటిజన్లు చాలా చక్కగా వేశారని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం గ్రేట్ రాహుల్ గారు మీరు చాలా సింపుల్ గా ఉన్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక రాహుల్ దోశలో వేస్తున్న క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సహా పలువురు నేతలు నవ్వూతూ చూడటం వీడియోలో కనిపిస్తుంది.